ఏపీలో టీడీపీ, తెలంగాణలో కాంగ్రెస్..! ఇప్పటికిప్పుడు ఎంపీ ఎన్నికలు జరిగితే వచ్చే ఫలితాలు ఇవే..!

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయో విశ్లేషిస్తూ ఇండియా టుడే ఆజ్ తక్ వెల్లడించిన ఫలితాల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణకు సంబంధించిన అంచనాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి.

ఏపీలో టీడీపీ, తెలంగాణలో కాంగ్రెస్..! ఇప్పటికిప్పుడు ఎంపీ ఎన్నికలు జరిగితే వచ్చే ఫలితాలు ఇవే..!

India Today Survey

India Today Survey : మరో రెండు నెలల్లో లోక్ సభకు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 400కు పైగా స్థానాల్లో విజయఢంకా మోగించనున్నామని ప్రధాని మోదీ రెండు రోజుల క్రితం పార్లమెంట్ సాక్షిగా చేసిన ప్రకటన నేపథ్యంలో ప్రఖ్యాత మీడియా సంస్థ ఇండియా టుడే ఆజ్ తక్ గ్రూప్ మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో తాజాగా చేసిన సర్వే సంచలనాత్మకంగా మారింది.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయో విశ్లేషిస్తూ ఇండియా టుడే ఆజ్ తక్ వెల్లడించిన ఫలితాల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణకు సంబంధించిన అంచనాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ఏపీలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే తెలుగుదేశం-జనసేన కూటమికి 17 లోక్ స్థానాలు.. వైసీపీకి 8 లోక్ సభ స్థానాలు లభించే అవకాశాలు ఉన్నాయని ఇండియా టుడే వెల్లడించింది.

మొత్తం ఓట్లలో టీడీపీ-జనసేన కూటమికి 45శాతం ఓట్లు, వైసీపీకి 41.01 శాతం ఓట్లు లభించే అవకాశాలు ఉన్నాయని ఇండియా టుడే సర్వేలో వెల్లడైంది. ఇక బీజేపీకి 2.1 శాతం, కాంగ్రెస్ పార్టీకి 2.7శాతం ఓట్లు ఏపీలో లభించవచ్చని తెలిపింది. ఏపీకి సంబంధించిన ఈ సర్వే వివరాలను ఇండియా టుడే ప్రసారం చేసింది.

Also Read : లోక్‌సభ ఎన్నికలు.. ఏ రాష్ట్రంలో ఎవరికి ఎన్ని సీట్లు..

అయితే, ఆశ్చర్యకరమైన రీతిలో టైమ్స్ నౌ అనే మరో ప్రముఖ మీడియా సంస్థ చేసిన సర్వే ప్రకారం ఏపీలో అధికార వైసీపీకి 19 సీట్లు, టీడీపీ-జనసేన కూటమికి 6 ఎంపీ సీట్లు వస్తాయని తేలింది. టైమ్స్ నౌ సర్వే ఫలితాలను బుధవారం ప్రసారం చేశారు.

ఇండియా టుడే-ఆజ్ తక్ సర్వే(ఆంధ్రప్రదేశ్)
టీడీపీ-జనసేన కూటమి – 17
వైసీపీ-08
బీజేపీ-00
కాంగ్రెస్-00

టైమ్స్ నౌ సర్వే(ఎంపీ ఎన్నికలు)-ఆంధ్రప్రదేశ్
వైసీపీ-19
టీడీపీ-జనసేన కూటమికి 6
కాంగ్రెస్ కి -0
బీజేపీకి-0
ఇతరులకు-0

ఇండియా టుడే-ఆజ్ తక్ సర్వే(తెలంగాణ)
కాంగ్రెస్-10
బీఆర్ఎస్-03
బీజేపీ-03
ఎంఐఎం-01

టైమ్స్ నౌ సర్వే(తెలంగాణ)
కాంగ్రెస్-09
బీజేపీ-05
బీఆర్ఎస్-02
ఎంఐఎం-01

ఇలా రెండు ప్రధాన సర్వే సంస్థలు పరస్పర విరుద్ధమైన సర్వే ఫలితాలు వెల్లడించడంతో వీటిలో ఏది నిజం కానున్నది? అనే దానిపై రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది.

Also Read : టీడీపీతో పొత్తు కుదిరితే.. బీజేపీ ఆశిస్తున్న ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు ఇవే? అభ్యర్థులు కూడా ఖరారు?

వైసీపీకి అంతిమ యాత్ర పక్కా అంటూ ఆజ్ తక్ – సీ ఓటర్ సర్వే వివరాలు ట్వీట్ చేశారు టీడీపీ నేత నారా లోకేశ్. ”సైకో పోతున్నాడు, సైకిల్ వస్తోందని ఆజ్ తక్ -సీ ఓటర్ సర్వే చెప్పింది. సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 45శాతం ఓటర్లు తెలుగుదేశం-జనసేన తోనే ఉన్నారు. తెలుగుదేశం-జనసేన కూటమి 17 ఎంపీ స్థానాలను గెలవబోతోంది. వైసీపీ ఓట్ల శాతం 41 శాతమే. వైసీపీకి వచ్చేది 8 ఎంపీ సీట్లే” అని లోకేశ్ ట్వీట్ చేశారు.

తెలంగాణకు సంబంధించి ఇటు ఇండియా టుడే, అటు టైమ్స్ నౌ సంస్థ వెల్లడించిన సర్వే అంచనాలు కూడా ఆసక్తికరంగానే ఉన్నాయి. తెలంగాణ మొత్తం 17 లోక్ సభ స్థానాలకు గాను అధికార కాంగ్రెస్ పార్టీకి 10 స్థానాలు, బీజేపీ బీఆర్ఎస్ కు చెరో 3 స్థానాలు, ఎంఐఎంకు ఒక స్థానం లభించవచ్చని ఇండియా టుడే సర్వేలో తేలింది.

అటు టైమ్స్ నౌ సర్వేలో.. కాంగ్రెస్ కు 9, బీజేపీకి 5, బీఆర్ఎస్ కు 2, ఎంఐఎంకు ఒక స్థానం దక్కుతుందని వెల్లడైంది. ఇండియా టుడే సర్వే ఇవాళ ప్రసారం చేయగా.. టైమ్స్ నౌ సర్వేను నిన్న వెల్లడించారు.